

మన న్యూస్:ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి వేడుకలు ఏలేశ్వరం మండలం బిజెపి అధ్యక్షుడు కూరాకుల రాజా ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు హాజరయ్యారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అపర రాజకీయ చాణుక్యుడని,సుపరిపాలన దక్షుడని, భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా నేషనల్ హైవే విస్తరణ అనేక రాష్ట్రాల్లో అనేక నెంబర్లతో నేషనల్ హైవే విస్తీర్ణ చేయడం ఆయనకే సాధ్యమైందని వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల ఉపాధ్యక్షుడు ఊటా వీరబాబు, పతివాడ వెంకటేశ్వరరావు,తోట వీర మహేశ్వరరావు,రాఘవరావు, గొడుగు నల్లబ్బాయి, దొడ్డిపట్ల సుబ్బరాజు, దొంతంశెట్టి చంద్రశేఖర్, శ్రీనివాస్, గోపి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.