

మన న్యూస్: తిరుపతి,క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తిరుపతి రూరల్ మండలం తాటితోపు లోని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం లో బుధవారం క్రిస్మస్ సంబరాలు డాక్టర్ వేదనాయగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంగ్లం చర్చ్ ఆఫ్ ఇండియా లో మాడివేటర్ జాన్ సత్య కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ వర్తమానం ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపులను రక్షించుటకు ప్రభువైన ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడని యేసయ్య జననం లోకంలో ఉన్న ప్రతి ప్రజలకు సంతోషకరమైన సువార్త మానమని తెలిపారు ప్రియమైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాడని చెప్పారు ప్రతి ఒక్కరికి తోడుగా ఏసుక్రీస్తు ఉంటున్నాడని, ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం డాక్టర్ వేదనాయగం మాట్లాడుతూ ఏసుక్రీస్తు చెప్పిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రతి ఒక్కరు శాంతి సమాధానం లో జీవించాలని దేశపు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని కోరారు.1000 మంది పేదలకు బట్టలు…అన్నదానం చేసిన డాక్టర్ వేద నాయగం..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ వేద నాయగం చేతుల మీదుగా సుమారు 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. మహిళలకు చీరలు జాకెట్లతో పాటు పురుషులకు ప్యాంటు షర్టులను పంపిణీ చేశారు. ఈ క్రిస్మస్ సంబరాలలో బిషప్ రాబర్ట్, రేవరండ్ హేమంత్, రెవరెండ్ దేవానంద్ పాల్గొన్నారు. ఇంతకుముందు దేవకృషి దేవుని ఆరాధన చేసి మహిమ పరిచారు. సందర్భంగా భారీ క్రిస్మస్ ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడికి వచ్చిన వారందరికీ పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
