

మన న్యూస్:గొల్లప్రోలు శాంతి దూత ఏసుక్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలులోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో క్రిస్మస్ వేడుకలు, భారత మాజీ ప్రధాని వాజ్ పేయ్ శత జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థన చేసిన అనంతరం వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రేమ, కరుణ, శాంతి లపై ఏసుక్రీస్తు చేసిన బోధనలను ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో పాటించాలని కోరారు. అలాగే దేశ ప్రధానిగా వాజ్ పేయ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వర్తనపు వీర్రాజు, మాజీ సైనికులు చేదులూరి సత్యనారాయణ, భారతాల శేషారావు,స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొసిరెడ్డి రాజా, సభ్యులు కొమ్ము సత్యనారాయణ, చోడపునీడి పుల్లపరాజు, కర్రి కొండలరావు, మలిరెడ్డి నారాయణరావు, పెదిరెడ్ల వెంకట్రాజు, బోడకుర్తి మహేష్, దర్శిపూడి విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.