

- వేలకోట్లు బాదుతున్న కూటమి సర్కారుపై నిరసన స్వరం
- పోస్టర్ ఆవిష్కరించిన జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి
వెదురుకుప్పం మన న్యూస్:– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల బాదుడు పై నిరసన కార్యక్రమ పోస్టర్ నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వద్ద ప్రజల తరఫున నిరసన, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి కరెంటు చార్జీలు తగ్గించాలని వినతిపత్రం అందజేత కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను మంగళవారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపా లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకు వైఎస్ఆర్సిపి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తుందని ప్రజల తరఫున నిరసన తెలియజేయడానికి పెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జీడి నెల్లూరు నియోజకవర్గ ఆరు మండలాల మండల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.