

మన న్యూస్: ప్రతినిధి)ఏలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్).ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్.సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్య లో భాగంగాసంస్థ అడ్వైజరీ బోర్డ్ డైరెక్టర్ వి వెంకట్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.తిరుమాలి గ్రామంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఏలేశ్వరం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కంటి వైద్య శిబిరం నేరేళ్లమ్మ తల్లి గుడి వద్దనిర్వహించారు.కంటి వైద్య నిపుణులు ఆదిత్య పర్యవేక్షణలో కంప్యూటర్ఐస్డ్ పరికరాలతో స్పార్క్ సంస్థ ఉచిత కంటి పరీక్షలు మరియు 30000- రూపాయలు వ్యయం తో మందులు పంపిణీ ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు మరియు కళ్ళజోళ్ళు సిఫార్సు చేశారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు,వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తిరుమాలి సర్పంచ్ సూతి వీర కృష్ణ ప్రసాద్, ఎంపీటీసీ పసల సూర్యనారాయణ, టీడీపీ నాయకులు, కోరుకొండ నూకరాజు,సూతి బాబులు,చదువోలు రాజా కూరాకుల నాగరాజు స్పార్క్ సంస్థ స్టేట్ ఇంచార్జ్ రవికిరణ్ ,కోఆర్డినేటర్ సాహుల్, నవనీత్ , నాగ సాయి, కామేష్ మరియు సభ్యులు సుధీర్, స్వామి ,శ్రీను జి గంగా సత్యనారాయణతదితరులు పాల్గొన్నారు.