

మన న్యూస్:.ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి పురస్కరించుకుని గణిత శాస్త్ర విభాగాధిపతి శ్రీ కే. సురేష్ ఆధ్వర్యంలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. సునీత అధ్యక్షత వహించి గణిత శాస్త్రం మానవాళి నిత్యజీవితంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, సామాన్య మానవులు కూడా గణిత శాస్త్రంతో సంబంధాలు కలిగి ఉంటారని ఆధునిక కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా బేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగు మరియు క్రిప్టోగ్రఫీ మొదలైన అంశాల్లో గణిత శాస్త్రము ముఖ్య భూమికి పోషిస్తుందని, నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి వ్యక్తికి గణితంతో సంబంధం ఉంటుందని తెలియజేశారు. తరువాత రామానుజన్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. రామానుజన్ చాలా పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అని అయినప్పటికీ గణిత శాస్త్ర అభివృద్ధి కి ఆయన ఒక కారణజన్ముడని కొనియాడారు. ఏదైనా ఒక నెంబర్ చెబితే దాని యొక్క ప్రాధాన్యం చెప్పగల గొప్ప భారతీయ గణిశాస్త్రవేత్తని కొనియాడారు. గణిత శాస్త్ర అధ్యాపకులు సురేష్ మాట్లాడుతూ గణితశాస్త్రం నిజజీవితంలో ఒక భాగమని గణితం లేనిదే ఏ వ్యక్తి తన మనుగడ సవ్యంగా సాగించలేరని కొనియాడారు. అదేవిధంగా 1729 సంఖ్య గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించి దాని యొక్క ఆకృతిని విద్యార్థుల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్ మరియు ఆన్లైన్ క్విజ్ నిర్వహించి. ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతుల్ని బాపమని, సారధి, మణికంఠ, ప్రసన్న, శిరీష, నవీన్ లకు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె . వెంకటేశ్వరరావు. ఎన్ఎస్ఎస్ పి.ఒ డా. ప్రయాగ మూర్తి ప్రగడ. అధ్యాపకులు వి. రామారావు. డా. ఎస్ కే మదీనా. డా. శివప్రసాద్. వీరభద్రరావు. శ్రీమతి శ్రీలక్ష్మి. డాక్టర్ బంగార్రాజు. శ్రీమతి పుష్ప. కుమారి రోజిలిన. శ్రీ సతీష్. మరియు పెద్ద సంఖ్యల విద్యార్థులు పాల్గొన్నారు.