రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెనక్కి తీసుకోవాలి,ఏఐవైఎఫ్ అశ్వాపురం మండలం సమితి డిమాండ్

మన న్యూస్:పినపాక నియోజకవర్గం, అశ్వాపురం; రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్, డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కు, ఆయన సిద్ధాంతాలకు బీజేపీ వ్యతిరేకమని వారు మండిపడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ను, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించకూడదని మనుస్మృతి, ఆర్ఎస్ఎస్ భావజాలం అమిత్ కు నేర్పుతోందన్నారు. దళితులను ఈసడించడమే పనిగా పెట్టుకున్న సంఘ్ పరివార్ దళితులకే కాదు, సామాజిక న్యాయం కోరుకునే వారందరికీ స్ఫూర్తి ప్రదాత డా. అంబేద్కర్ ను అవమానించడం చాలా సులువైన వ్యవహారంగా మారిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్” అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు భగవంతుడి పేరు తలిస్తే ఏడు జన్మల దాకా స్వర్గ ప్రాప్తి కలిగేది అని అన్నారన్నారు. అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు బీజేపీ, ఆర్.ఎస్.ఎస్.కు త్రివర్ణ పతాకం మీద, అశోకచక్రం మీద విశ్వాసం లేదని నిరూపించాయన్నారు. సంఘ్ పరివార్ అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించి రూపొందించిన భారత రాజ్యాంగం మీద ఇసుమంత గౌరవం కూడా లేదని అనేకసార్లు రుజువైందన్నారు. ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం మీద 50 ఏళ్లపాటు త్రివర్ణ పతాకం ఎగురవేయడానికి నిరాకరించిందని, గాంధీ హత్య తరవాత అప్పుడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ఆర్.ఎస్.ఎస్. ను నిషేధించారని గుర్తుచేశారు. తర్వాత అనేక వాగ్దానాలు చేస్తేనే గాని ఆర్.ఎస్.ఎస్. మీద నిషేధం తొలగలేదన్నారు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ఆర్.ఎస్.ఎస్. హామీ ఇవ్వవలసి వచ్చిందన్నారు.ఆ ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన అమిత్ షా నోటికొచ్చినట్టు అంబేద్కర్ అని అయిదుసార్లు అని ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారని, అమిత్ షా ప్రతిపక్షాలను దుయ్యబట్టడానికే ఈ మాట ప్రస్తావించి ఉండవచ్చు. కానీ ఈ క్రమంలో అంబేద్కర్ నూ తీవ్రంగా అవమానించారన్నారు.ఈ కార్యక్రమంలో
ఏఐవైఎఫ్ అశ్వాపురం మండల నాయకులు, రాజు, రాము, రఘు, సతీష్, శ్రీకాంత్, తదులు పాల్గొన్నారు

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///