

మన న్యూస్: ప్రతినిధి ఏలేశ్వరం:పట్టణంలోని శ్రీ అనంత లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో విశ్వహిందూ పరిషత్అ నుబంధ సంఘాలైన మాతృశక్తి, దుర్గావాహినీల సంఘాలకు నూతన కార్యవర్గాన్ని శుక్రవారం విహెచ్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాతృశక్తి అధ్యక్ష కార్యదర్శులుగా గిరిజా కుమారి,సౌజన్యను ఎన్నుకున్నారు.అలాగే దుర్గవాహిని సంఘానికి అధ్యక్ష కార్యదర్శులుగా ఆర్.రేవతి,ఆర్.వరలక్ష్మి లను ఎన్నుకున్నారు.ఈ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా వి.శారద,పి.లక్ష్మీ కుమారులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సుగుణ,సూర్య కుమారి, మంగామని,లక్ష్మి, హైమావతి,కామాక్షి, విహెచ్పి సంఘ పెద్దలు ఏడిపి ప్రసాద్, కటకం కిరీటి, టీ గురవయ్య,ఉడతల రామారావు, ఎం .సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.