క్రీడ‌ల్లోనూ విద్యార్థులు రాణించాలిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీలను జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు ప్రత్యేక శ్ర‌ద్ద చూపుతున్నారని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్క‌డ‌ అమ్మాయి…ఇక్క‌డ అబ్బాయి సినిమా నుంచి కూడా యువ‌త‌లో క్రీడా స్పూర్తిని నింపార‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌పంచ‌స్థాయి ఏషియ‌న్ స్పోర్ట్స్, 2026 ఒలంపిక్ స్పోర్ట్స్ , 2028 కామ‌న‌వెల్త్ క్రీడ‌ల‌ను నిర్వ‌హించ‌క‌లిగిన క్రీడా స‌ముదాయాల‌ను నిర్మించాల‌నేది మ‌న ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీషా, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోషియేష‌న్ అధ్య‌క్షులు విజ‌య్ కుమార్, సాంకేతిక విద్యా శాఖ జాయింట్ డైరక్ట‌ర్ నిర్మ‌ల్ కుమార్ ప్రియా, ప్రిన్సిప‌ల్ ద్వార‌కానంద రెడ్డి, పిజిక‌ల్ డైర‌క్ట‌ర్ రాజీవ్, స్టేట్ ఫిజిక‌ల్ డైర‌క్ట‌ర్ నాగేశ్వ‌ర రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి