

తవణంపల్లి డిసెంబర్ 19 మన న్యూస్
చిత్తూరుజిల్లా, తవణంపల్లి మండలం,అధునాతన వైద్యం తో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలను అరగొండ అపోలో ఆసుపత్రి యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని , అరగొండ అపోలో ఆసుపత్రి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్మోహన్ రెడ్డి, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సమ్మి , కార్తీక్ రెడ్డి లు తెలిపారు. వారు మాట్లాడుతూ మొదటగా చెన్నై అపోలో ఆసుపత్రిలో భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలకు శ్రీకారం చుట్టగా 100% విజయవంతమైందన్నారు, అరగొండ అపోలో ఆసుపత్రిలో కూడా అత్యాధునిక పద్ధతిలో భుజం మార్పిడి శస్త్ర చికిత్స విధానం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు, ఆధునాతన వైద్యం ద్వారా భుజం మార్పిడి శాస్త్ర చికిత్సలు చేస్తే నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని రోగి కేవలం 6 వారం లోనే కోలుకునే కోలుకుంటారని తెలిపారు, దీర్ఘకాలికంగా భుజం నొప్పి అధికంగా ఉన్నవారు సాధారణ శాస్త్ర చికిత్సల ద్వారా నయం చేయలేని ఎముకలు పగుళ్లు ఉన్నవారు భుజం ఆపరేషన్లు విఫలమైన వారికి ఈ అత్యాధునిక వైద్య విధానం ద్వారా శాస్త్ర చికిత్సలు చేయడం ద్వారా 100% ఫలితం ఉందని వెల్లడించారు, ఇతర ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అపోలో ఆసుపత్రిలో చేసుకుంటే కేవలం 3 లక్షల రూపాయల తోనే భుజం మార్పిడి శాస్త్రం కోవచ్చని తెలిపారు, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు, ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి , అపోలో ఆసుపత్రి.పి ఆర్ ఓ కమ్రుద్దీన్, బానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.