

మన న్యూస్: గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధ గురువారాల్లో సత్య హరిచంద్ర అల్లూరి సీతారామరాజు నాటకళా ప్రదర్శనలు నిర్వహించారు. సత్య హరిచంద్రలో హరిశ్చంద్రుడిగా కరెడ్ల బాబ్జి దొడ్డిపట్ల సత్యనారాయణ చంద్రమతిగా నంది అవార్డు గ్రహీత విజయనగరం కు చెందిన కె.వి పద్మావతి విశ్వామిత్రుడుగా జిల్లా భజన మండలి సంఘ కన్వీనర్ ధర్మారం వీర వెంకట విజయ దుర్గ నాట్యమండలి అధ్యక్షుడు సాన నూకరాజు నాయుడు కళాకారులు నటించి పౌరాణిక నాటక క్రియలను మంత్రముగ్గులను చేశారు.. అనంతరం కళాకారులను ధర్మవరం విజయదుర్గ నాట్యమండలి అధ్యక్షులు నూకరాజు కమిటీ సభ్యుడు దొడ్డిపట్ల సత్యనారాయణలు ఘనంగా సన్మానించారు.. రెండవ రోజు అల్లూరి సీతారామరాజు నాటక ప్రదర్శన నిర్వహించారు. ఈ నాటకంలో అల్లూరి సీతారామరాజు గా గోపు రాంబాబు బాష్టియన్గా గళ్ళ పద్మారావు గంటo దోర గా నూకరాజు నాయుడు.. తదితర కళాకారులు నటించి మెప్పించారు.