

మన న్యూస్: ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూల గిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రత్తిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భాను మూర్తి జ్ఞాపకార్ధం వారి సతీమణి పుష్పలత 100116 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందచేశారు.అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్య ప్రసాద్ 10000 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకి తెలియచేశారు.ఈ సందర్బంగా వారిని ప్రముఖ పురోహితులు,ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్ఛరణతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్బంగా రెడ్నం రాజా,తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు.అలాగే ప్రముఖ వ్యాపార వేత్త అనంతపల్లి శ్రీనివాస్,సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్,చాట్ల పుష్పారెడ్డి,పత్రి రమణ,గోగుల బుజ్జి,మదినే నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.