

మన న్యూస్:ఏలేశ్వరం: ప్రతి రైతు పంటల బీమాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక భరోసా పొందాలని మండల వ్యవసాయ అధికారి బి జ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మండలంలోని రమణయ్యపేట గ్రామంలో నిర్వహించిన రైతు సమావేశంలో ఆమె మాట్లాడారు.వరి రైతు ఎకరానికి 630 రూపాయలు ఈ నెల 31 వ తేదీలోగా చెల్లించాలన్నారు. అపరాల రైతులు ఎకరాకు 300 రూపాయలు ప్రీమియం చెల్లించాలన్నారు.మీ దగ్గర్లో ఉన్న మీసేవ సెంటర్లో సొమ్ము చెల్లించి బీమా చేయించుకోవాలని కోరారు. భీమ పొందిన రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన గాని మరి ఏ విధముగా నైనా కానీ పంట నష్టపోయిన పూర్తిస్థాయిలో నష్టపరిహారం పొందే అవకాశం ఉందన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సర్పంచ్ గుమ్ములూరి జగదీశ్వరి,సునీత, పలివెల శ్రీనివాస్, చెల్లా రాజారావు, ముదరా కామరాజు, గ్రామ కార్యదర్శి వీర్రాజు,వ్యవసాయ సిబ్బంది దాడిశెట్టి దివ్యచక్ర, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.