

మన న్యూస్:పినపాక,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ మండలాద్యక్షుడు గొడిశాల రామనాథం బుధవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు,కేటీఆర్ లు ప్రభుత్వం పై మాట్లాడుతున్న అవహేళన మాటలలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ఆటో డ్రైవర్ గా మారి ఉదయాన్నే కట్టె తుపాకి రాముడు లాగా మారి ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరన్నారు. మీరు,మీ ఎమ్మెల్యేలు 2028 సంవత్సరం వచ్చే వరకు ఆటో డ్రైవర్ లు గానే పనిచేయాలని హితవు పలికారు.ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు టిక్కెట్ టిక్కెట్ అనాల్సిందేనని మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం100% ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో తోలెం అర్జున్,నవాతి శ్రీను సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.