

మన న్యూస్:తిరుపతి, డిసెంబర్17ఆటో నగర్ లో మంగళవారం ఉదయం రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సుకు ఇంటి స్థలాల కోసం 62 వినతిపత్రాలు రాగా 76 అర్జీలు వివిధ రకాల రెవెన్యూ సమస్యలపై వచ్చాయి.ఉదయం నుంచి సాయంత్రం వరకు రెవెన్యూ అధికారులు తహశీల్దారు బాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.ఆటోనగర్ లో సత్యసాయి ట్రస్టు కి ఇచ్చిన స్థలాన్ని వైసిపి కార్పొరేటర్ భర్త అజయ్ కుమార్,నాగేశ్వర రావు లు ఆక్రమించారని ఎన్డీఎ నాయకులు చల్లా, బాబ్జీ, పెంచలయ్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎన్డీఎ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.ప్రజలు రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆటోనగర్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నివాసం ఉంటున్న వారికి ఎలా మేలు చేయాలన్న విషయమై నివేదిక ఇవ్వాలని తహశీల్దారు భాగ్యలక్ష్మి ని ఆయన ఆదేశించారు. సత్యసాయి ట్రస్టు భూమి ఆక్రమణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిటిడి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్,క్లస్టర్ ఇంచార్జీ కృష్ణ యాదవ్,రామా యాదవ్, పెంచలయ్య, కమల్ నాయుడు,నాని,జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి,శంకర్ గణేష్,భరత్,దివాకర్,సుజిత్, దినేష్,సరితా నాగరాజు,శివ కుమార్, నాగరాజు,కెంఎంకె లోకేష్,వూస మాధవ రావు,ఆముదాల వెంకటేష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.