

మన న్యూస్:సరూర్నగర్ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఇట్టి కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ ఎంతో పవిత్ర మైన అయ్యప్ప దీక్షలో ఉన్న అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు గురుస్వామి ప్రేమ్ గాంధీ
ఆధ్వర్యంలో 10,000 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించబడుతోంది. అయ్యప్ప స్వాములకు 41 రోజుల భిక్ష కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుతున్న వారు భక్తి పరవశానికి నిదర్శనమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని,ఆ అయ్యప్ప కరుణా గురుస్వామి ప్రేమ్ గాంధీ మీద ఉండాలని ఆకాంక్షించారు.అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ ప్రచార కార్యదర్శి
ప్రేమ్ గాంధీ సేవా ల కోసం 9393202615 కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరని కోరారు