

మన న్యూస్: పొట్టి శ్రీరాములు వర్ధంతి , ఆత్మార్పణ దినం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో గంగినేని చెరువు వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం గంగినేని చెరువు వద్ద నున్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజ చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు, త్యాగనిరతిని ఎమ్మెల్యే వివరించారు ఆర్యవైశ్య నాయకులు చల్లూరు ద్వారకనాథ్ మాట్లాడుతూ అమరజీవిని స్మరించుకుంటూ జాతి కోసం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజహసింహులు, వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు మరియు చిత్తూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య నాయకులు ఆరూరు ప్రసాద్ బాబు, చల్లూరు ద్వారకనాథ్, మువ్వల నరసింహుల శెట్టి, బలసా వేణుగోపాల్, చిలంకూరు వెంకటేష్, గోవర్ధన్, తాళంకి లక్ష్మీనారాయణ,ఆరూరు రామమూర్తి, శ్రీధర్ సత్య, బైసాని బాబురావు, బైసాని చంద్రశేఖరరావు, శివ ప్రసాద్ శ్రీనివాసమూర్తి, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.