

మన న్యూస్: పాచిపెంట డిసెంబర్15 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం పత్రిక రంగం అటువంటి పత్రిక రంగంలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల పైన దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలోని. గాంధీ బొమ్మ వద్ద ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా విలేకరుల పైన దాడులు సరైనవి కాదని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటి వ్యవస్థ పత్రిక రంగమని అటువంటి వ్యవస్థ పైన పనిచేస్తున్నటువంటి సమస్యలను వెలికి తీసి ప్రజలకి చైతన్యం కలిగించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాదిశా నిర్దేశం చూపించినటువంటి పత్రిక రంగం పైన దాడులు సరైనవి కాదని దీనిపై కఠినంగా చట్టాలు తీసుకొచ్చి భవిష్యత్తులో దాడులు జరగకుండా చూడాలని దాడులు చేసినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కడపలో సాక్షి విలేకర్ పని అయితేనేమి అలాగే టీవీ9 విలేకరిపైన మోహన్ బాబు దాడి అయితే నేమి అంతకుముందు కూడా అనేకమంది విలేకరులపై దాడులు చేయడం సిగ్గుచేటని దీన్ని ప్రజలంతా కూడా ఖండించాలని భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు విలేకరులకు అండగాపని చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆకుల వసంతరావు మాధవరావు గిరిజన సంఘ నాయకులు కొర్ర శ్రీనివాసరావు సూక్రరు ఎర్రయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుర్రు రామారావు డివైఎఫ్ఐ నాయకులు ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.విలేకరులపై దాడులను ప్రజాస్వామ్యవాదులు ప్రజలు తీవ్రంగా ఖండించాలని కోరారు.