

మన న్యూస్: నిజాంసాగర్,( జుక్కల్ )
స్వచ్ఛ భారత్‌లో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వాలు వాటి నిధులను విడుదల చేయడం తో జాప్యం చేస్తున్నాయి. బహిరంగ మల, మూత్ర విసర్జనను నిషేధించిన పాలకులు గ్రామాలు, పట్టణాల్లోని నిరుపేదలు ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి, అప్పుతెచ్చి శౌచాలయాలు నిర్మించుకుంటే వాటికి బిల్లులు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. మరుగుదొడ్లు నిర్మించుకోగానే వెంటనే మీ వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ఆశ చూపిన అధికారులు.. ఇప్పుడు బిల్లుల గురించి అడిగితే ముఖం చాటేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గతంలో భారత్ అభియాన్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.6వేలు చెల్లించారు. తర్వాత యూనిట్ ధరను రూ. 9వేలకు పెంచారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్లూ వచ్చారు. లక్ష్యం చేరుకోవడానికి అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలని సూచించారు. దీంతో చాలామంది ముందుకు వచ్చి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు.మరుగుదొడ్లను గతంలో ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకునే అవకాశం ఉండేది. కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలకు అవకాశం క ల్పించింది. అప్పటినుంచి ఉపాధి పథకంలో అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం మరుగుదొడ్ల నిర్మాణా లు పూర్తయి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారి వి వరాలు స్వచ్ఛభారత్ మిషన్‌యాప్‌లో నమోదై ఉన్నా యి. మరుగుదొడ్డి నిర్మాణ దశ ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఒకవేళ నూతనంగా ఉపాధి హామీ పథకంలో మరుగుదొడ్డి నిర్మాణాలకు అవకాశం ఇచ్చి నా.. ప్రస్తుత ఎస్‌బీఎంలో మరుగుదొడ్డి నిర్మించుకున్నవారికి బిల్లులు మంజూరు కావు. తమకు త్వరగా బి ల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.అప్పు చేసి.గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మరుగుదొడ్డి నిర్మించాలంటే నాలుగేసి వరలతోపాటు రెండు సెప్టిక్ ట్యాంకులు నిర్మించాలనే నిబందన విధించారు. దీనితో మరుగుదొడ్డి అసలు లేనివారు దీనిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే రూ.12వేలు సరిపోలేదు. అదనంగా మరో రూ.4వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కట్టిన తర్వాత ఎలాగో ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్న నమ్మకంతో గతంలో మరుగుదొడ్లు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఎన్నేళ్లయినా బిల్లులు రాకపోవడంతో వారు మానుకున్నారు. కాంట్రాక్టర్లతో పని లేకుండా ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకు మరుగుదొడ్లు నిర్మించుకుంటే విడతల వారీగా నగదు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఆ తర్వాత మొండి చూపాయి.మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో గత ప్రభుత్వంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి విరిగా వారికి డబ్బులను ఇస్తామని ప్రభుత్వం గ్రామపంచాయతీ అకౌంట్లోకి డబ్బులను విడుదల చేసింది. కానీ నిర్మించుకున్న వారికి అక్కడక్కడ కొన్ని డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులను గత ప్రభుత్వంలో తాజా మాజి సర్పంచ్ మింగేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి కొంతమందికి ఇటుక కంకర ఇసుకను ఇచ్చి సగం పైసలు కట్ చేసుకుని మిగతా డబ్బులు కొందరికి ఇచ్చినట్లు సమాచారం, నిర్మించుకొని వారి డబ్బులు ఎక్కడున్నాయి ఎవరు మింగేశారు అన్నదే ప్రశ్న అర్థంగా మారింది. అప్పట్లో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితంగా మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తాయని చెప్పి మరుగుదొడ్లు నిర్మించుకున్న తర్వాత బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఇది అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు గ్రహించగలరు.హసన్ పల్లి గ్రామంలో మరుగుదొడ్లు బిల్లులు మింగేసినట్టు తాజా మాజా సర్పంచ్ పై ఆరోపణలు ఉన్నాయి. అధికారులు లబ్ధిదారులకు బిల్లులను ఇప్పిస్తారు లేదో వేచి చూడాల్సిందే.