

మన న్యూస్,ఎల్లారెడ్డి ,నిజాంసాగర్,గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేక పోతున్న సమయంలో రోజు బిక్షటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ అనాధ కుటుంబం తల్లితోపాటు ఇద్దరు చిన్న పిల్లలు చలికి కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక చాలా ఇబ్బంది పడుతు రాత్రిపూట చలి తీవ్రత ఎక్కువగా ఉండటం ఇలాంటి పేద కుటుంబానికి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా వారికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ రోడ్డు పక్కన నిద్రిస్తున్న అభాగ్యుల కుటుంబం చలితో ఇబ్బందులు పడుతుండడంతో వారికి దుప్పట్లు అందజేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు. ఒకవైపు చలి, మరోవైపు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నందున అనాధ కుటుంబానికి ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సంతోష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ నాగేష్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు నాగం శ్రీనివాస్, శంకర్, సృజన్ గౌడ్, సర్దార్, ప్రకాష్ తదితరులు ఉన్నారు.