

మన న్యూస్,నిజాంసాగర్,( బాన్సువాడ ) బాన్స్ వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు డైట్ చార్జీలను, మేస్ చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బాన్సువాడ మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కామన్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యతమైన విద్యతోపాటు భోజనం అందించాలని లక్ష్యం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు