

మన న్యూస్:నిజాంసాగర్,( జుక్కల్ )కూలిపోయే పరిస్థితిలో జీరో డిస్ట్రిబ్యూటరీ బ్రిడ్జి.. ప్రతి పంటకు రైతులు ముళ్ళ పొదలను తొలగిస్తూ నీటిని తీసుకువచ్చి పంట పొలాల సాగు మంత్రి రాకతో జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువ బాగుపడేనా అన్నది ప్రశ్నార్థకం ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువను పట్టికెట్టించుకునే నాధుడే కరువాయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిజాంసాగర్ ప్రాజెక్టుకు హెడ్స్ లుస్ కు అనుసంధానంగా ఉన్న జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువకు ఇప్పటివరకు కనీస మరమ్మత్తులు చేయలేక పంట పొలాలకు నీరు రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువ ప్రభుత్వాలు మారుతున్న జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువకు మరమ్మతులు చేయాలని ఆలోచన అధికారులలో లేకపోవడం ప్రభుత్వాల తీరు సరిగా లేకపోవడమా అన్న చందనంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి నీటిని విడుదల చేయడానికి మంత్రులు వచ్చిన వారికి జీరో డిస్ట్రిబ్యూటరీ కాల్వ గురించి రైతులు వివరిస్తే మరమ్మతులు చేపిద్దాం అని చెప్పి వెళ్ళడమే కానీ ఇప్పటివరకు జీరో డిస్ట్రిబ్యూటరీ కాల్వ వెంట ప్రతి పంటకు రైతులు ముళ్ళ పొదలను తొలగిస్తూ నీటిని తీసుకువచ్చి పంట పొలాలు సాగు చేసుకునే పరిస్థితి ఉంది. శుక్రవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడానికి వస్తుండడంతో ఈసారైనా జీరో డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను చేపడతారో లేదో వేచి చూడాల్సిందే ?
