

మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు :ఆంధ్రా భద్రాద్రి శ్రీరామ సేవక్ కమిటీ ఆధ్వర్యంలో సేవాతత్పరుడు చాట్ల పుష్పారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి దివ్య క్షేత్రం వద్ద పుష్పారెడ్డితో శ్రీరామ సేవక్ కమిటీ సభ్యులు కేక్ కట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాకినాడ వాస్తవ్యుడైన పుష్పా రెడ్డి శ్రీరామ నామ క్షేత్ర నిర్మాణంలో కీలక పాత్ర వహించడమే కాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆంధ్రా భద్రాద్రి నిర్మాణానికి తొలుత శ్రీకారం చుట్టారని కొనియాడారు.శ్రీరాముని కృపాకటాక్షాలతో అయన మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో శ్రీరామసేవక్ సభ్యులు తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ,గోగుల వెంకటేశ్వరరావు,పత్రి రమణ, రెడ్నం రాజా,కాలపురెడ్డి శ్రీను, వెలుగురి హరేరామ్,మదినే నూకరాజు,నేతి శ్రీనివాసరావు, గానాల గంగాధర్,వనపర్తి గణేష్, మహిళా భక్తులు పాల్గొన్నారు.