ప్రైవేట్ పాఠశాల డ్రైవర్లకు, క్లీనర్లకు చట్టబద్ధ హక్కులు అమలు చేస్తాం! కార్మిక శాఖ అధికారి నాగరాజు మధ్యవర్తిత్వంలో ప్రవేటు పాఠశాలలతో కుదిరిన ఒప్పందం

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, మణుగూరు మండలంలో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లకు క్లీనర్లకు ఛట్టబద్ధమైన హక్కులను అమలు చేస్తామని మణుగూరు కార్మిక శాఖ అధికారి నాగరాజు తెలిపారు.మణుగూరు కు చెందిన ప్రముఖ సామాజిక సేవకులు కర్నే బాబురావు ఫిర్యాదు మేరకు ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు లేబర్ ఇనస్పెక్టర్ ఎన్. నాగరాజు బుధవారం శివలింగాపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి తో కార్మిక శాఖ అధికారి నాగరాజు చొరవతో సామరస్య వాతావరణంలో చర్చలు జరిగాయి. ఒప్పందపు వివరాలు ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లకు, క్లీనర్లకు సంవత్సరానికి రెండు జతల కాకి యూనిఫామ్, వారాంతపు సెలవు, నెలకు రెండు సెలవు దినాలు, కార్మిక శాఖ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జీవో అమలు చేస్తాం,పిఎఫ్ అమలు, 15 రోజుల గడువు లోపల అమలు చేస్తామని హామీ ఇచ్చారని బాబురావు విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి నాగరాజు కి కృతజ్ఞతలు తెలిపారు. తమ చట్టబద్ధ హక్కుల కోసం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై ఒత్తిడి చేసి తమకు న్యాయం చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావును ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్లు, క్లీనర్లు ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన