

పినపాక, మన న్యూస్: నియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను సీఐఈఆర్ పోర్టల్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ కొమరం వినోద్ కుమార్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రశంస అవార్డు అందజేశారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ ప్రశంసా అవార్డ్ ను అందజేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా 220 మొబైల్ ఫోన్లు ఈ సందర్భంగా సంబంధిత వినియోగదారులకు అందించారు. కాగా ఏడూళ్ళ బయ్యారం పీ ఎస్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ లో ప్రతిభ కనబరిచిన ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొమరం వినోద్ కుమార్ ను అంకిత భావంతో విధులు నిర్వహించడం పట్ల ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వర రావు, ఎస్ ఐ రాజ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.