

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని యర్రవరం గ్రామంలో విజ్ఞాన్ జ్యోతి కళాశాల నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని,ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన,మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్నవారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు.ఈ సందర్భంగా స్పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో,యూనివర్సిటీల్లో మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేత లేని సమాజ నిర్మాణం కోసం మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని,ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబరు 10న ప్రతి ఏడాది మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య,విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరస్పాండెంట్ వెంకట రమణ,నాగేశ్వరరావు అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.