

బంగారుపాళ్యం డిసెంబర్ 9 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, చీకూరుపల్లె గ్రామంలో కొలువైయున్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వనభోజన మహోత్సవానికి హాజరైన ఆయనకు స్ధానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సిద్దేశ్వర స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. వనభోజన మహోత్సవం భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వనభోజన వంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. ధార్మిక కార్యక్రమాలు, సమాజానికి సేవ చేసే ప్రయత్నాలు చేయాలని, అందరం కలిసి ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ఈ విధమైన వేడుకలు జరుగడం ఆనందదాయకమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి.ధరణీ నాయుడు,మండల నాయకులు సూరి, రమేష్, హరిబాబు, మరియు మండల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.