బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం
మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు బాధిత కుటుంబాలను చూసి విచారం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున ముగ్గురికి 30 వేలు,పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబానికి రూ.5 వేలు మొత్తం 35 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఈ సందర్బంగా ఆమె భరోసా ఇచ్చారు.పల్లె ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ దిశగా జనసైనికులు చర్యలు చేపట్టాలని బార్లపూడి క్రాంతి సూచించారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నివారణ దిశగా చర్యలు చేపట్టే విధంగా చూడాలని,ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా క్రాంతి అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు సూర్నీడి సురేష్ కుమార్,బోసు రాజు,ఉలవల నాని,నల్లల రామకృష్ణ ,బుజ్జి,కర్రి జయబాబు,సత్యంశెట్టి రాజేష్,మాగాపు రాజా తదితరులు పాల్గొన్నారు.







