తవణంపల్లి డిసెంబర్ 6 మన ధ్యాస
తవణంపల్లి మండలం దిగువ మోదలపల్లి గ్రామానికి చెందిన బి.ప్రశాంత్ (17) అదృశ్యం అయిన ఘటనపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు వివరాలు ప్రకారం. బి.రేవతి తనభర్త బి.హనుమంతు తో కలిసి తవణంపల్లిలో నివసిస్తున్నారు వారి కుమారుడు ప్రశాంత్ బంగారుపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు ఇటీవల కొద్ది రోజులుగా ప్రశాంత్ మొబైల్ ఫోను ను అధికంగా ఉపయోగిస్తున్నాడని గుర్తించిన తల్లి అతన్ని మందలించినట్లు తెలిసింది అనంతరం ఈనెల 3వ తేదీన కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ప్రశాంత్ సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు అతని గురించి తల్లిదండ్రులు కాలేజీలో, బంధువుల లో విచారణ జరిపినప్పటికిని ఎటువంటి ఆచూకీ లభించలేదు దీంతో బాధ్యత తల్లి బి.రేవతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు సమర్పించారు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాలుడు అదృశ్యమైన కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చెపుతూ ప్రశాంత్ ఆచూకీ గాని అతని ఎక్కడైనా గుర్తించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరుచున్నారు







