మన ధ్యాస ప్రతినిధి, రాయదుర్గం, డిసెంబర్ 6: రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహల్ మండల పరిధిలోని కల్యం గ్రామము నందు మరియు గుమ్మగట్ట మండలం పరిధిలోని ఎర్రంపల్లి గ్రామాల నందు పర్యటించిన*రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు మరియు రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాపు రామచంద్రారెడ్డి.శ్రీ ఆంజినేయస్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించారు..కాపు ఆత్మీయుల సమావేశం నందు పాల్గోన్ని తమ అభిమానును ప్రతి ఒక్కరిని పెరు పేరునా పలకరిస్తూ మీకు ఏ అవసరం వచ్చినా ఎవరు ఏ ఇబ్బంది పెట్టిన, కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు అనే విషయం మర్చిపోవద్దు అని వారిందరికి ధైర్యం చెప్తూ రాబోయే రోజుల్లో మన అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని తెలిపారు..అంతకు ముందు ఆయా గ్రామాలలో కాపు రామచంద్రారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానించారు..కాపు రామచంద్రారెడ్డి కి పూలమాల వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు* ఈ కార్యక్రమంలో టౌన్ మున్సిపల్ కౌన్సిలర్ల,గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు,కాపు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు,,.







