కార్యకర్తల సంక్షేమానికే నా మొదటి ప్రాధాన్యత … రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

కార్యకర్తల అండగా ఉంటు, పురిటి గడ్డ రుణం తీర్చుకుంటా మంత్రిగోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగిన విధి వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 6:
కార్యకర్తలకు అండగా ఉంటూ పురిటి గడ్డ రుణం తీర్చుకుంటామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సిటీ నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సంక్షేమనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించారు.తెలుగు దేశం పార్టీ కాయకర్తలతో క్యాంపు కార్యాలయం పసుపుమయంగా మారింది.కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తానని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాదికి 10 కోట్ల సొంత నిధిని కార్యకర్తల సంక్షేమానికి కేటాయించిన ఆయన ఈ విడతలో 303 మందికి ఒక్కొక్కరికి 25వేల వంతున కుమార్తె షరణీతో కలిసి 76,25 లక్షల రూపాయల చెక్కులను కార్యకర్తలకు అందజేశారు. ఇప్పటివరకు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల చెక్కులను అందజేసినట్లు వెల్లడించారు. తనను గెలిపించిన ప్రజలకు.. తనను భుజాలపై మోసే కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. చెక్కులు అందుకున్న కార్యకర్తలందరూ మంత్రి పొంగూరు నారాయణతో పాటు.. షరణి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలను గుర్తుపెట్టుకుని.. వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక మంత్రి పొంగూరు నారాయణ అంటూ వారు కొనియాడారు. కుటుంబ సభ్యుల సహకారంతో కార్యకర్తలకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు…
అనంతరం మంత్రి కుమార్తె షరిణి మాట్లాడుతూ….. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు సాయం చేయడం మాత్రమే తన తండ్రికి తెలుసని.. పేదరికంలో పుట్టాడు కాబట్టే.. నిరుపేదల కష్టాలను తెలుసుకున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తన తండ్రి తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలతో పాటు.. ఇవ్వని హామీలను సైతం నెరవేరుస్తున్నారని వెల్లడించారు. 2024 ఎన్నికల ప్రచారంలో తన తండ్రిని చాలా మంది చాలా మాటలన్నారనీ ఆమె గుర్తు చేశారు. మా నాన్న మాటల మనిషి కాదని.. చేతల మనిషని ఇప్పుడు అందరికీ అర్థం అవుతుందన్నారు. నెల్లూరు నగరాన్ని మెట్రోపాలిటిన్ సిటీ చేసే దిశగా ముందుకు సాగుతున్నారనీ వివరించారు. ఎన్నికల ఫలితాలు రాకముందే కార్యకర్తలకోసం ఏడాదికి పదికోట్లు కేటాయించాలని తమ కుటుంబం నిర్ణయించిందన్నారు. ఆ నిధి నుంచి కార్యకర్తలకు విడతవారిగా సహాయం చేస్తున్నామనీ అన్నారు.
దేశంలో ఏ నేతా చేయని విధంగా కార్యకర్తలకు తన తండ్రి ఆర్థికసహాయం చేస్తున్నారని అన్నారు. తోపుడు బండ్లు ,సహాయనిధి చెక్కులు తీసుకొన్న వారి కళ్ళలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందన్నారు. 63 మందికి తన చేతులు మీదగా తోపుడు బండ్లు, ఇస్త్రీ బండి, 7
ట్రై సైకిల్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. చిన్నతనంలో తన తండ్రి ఎన్నో ఇబ్బందులు పడ్డారని,కస్టపడి చదివి ఈ స్థాయికి వచ్చారనీ అన్నారు. పుట్టిన గడ్డ ఋణం తీర్చుకోవాలని నాయకుడయ్యారని శరణి తెలిపారు. అందరి మన్ననలు పొందుతూ ప్రజానాయకుడిగా ముందుకు సాగుతున్నారనీ ఆమె మీడియాకు తెలిపారు. నాన్న బాటలో నడుస్తూ మీకందరికీ అండగా ఉంటానని శరణి భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, రాష్ట్ర వెర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిరా శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ , మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, డివిజన్ కు సంబంధించిన కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం