. మన ధ్యాస, కొడవలూరు, డిసెంబర్ 6:
సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం భావి తరాలకు ఆదర్శం కావాలని కోరారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొడవలూరులో ఆమె రాజ్యాంగ నిర్మాత చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది లాంటి రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కీలకపాత్ర పోషించారన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు అమూల్యమన్నారు. స్వేక్ష, సమానత్వం సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి బాబాసాహెబ్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు తహసీల్దారు స్ఫూర్తిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.







