చిత్తూరు, మన ధ్యాస, డిసెంబర్ 6 చిత్తూరు ఎస్టియు ఆఫీసు నందు మామిడి రైతుల ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం.సి.మునీశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశాన్ని ఉద్దేశించి సి మునీశ్వర్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి బంగారు మురళి లు మాట్లాడుతూ. మామిడి రైతులకు బకాయిలు రూ 8 రూపాయలు గుజ్జు పరిశ్రమలు వెంటనే ఇవ్వాలని. 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల. ఆలస్య రుసుము కూడా రైతులకు ఇవ్వాలని. ఇప్పటికే చాలా మార్లు. ప్రభుత్వ అధికారులను. అధికార పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని. మళ్లీ రాబోయే సంవత్సరం మామిడి పంటకు దుక్కులు దున్నడం.మందులు కొట్టడం.ఇతర సస్యరక్షణకు పెట్టుబడి కూడాపెట్ట లేని పరిస్థితి రైతులకు నెలకొందని . రైతులకు ఇవ్వాల్సిన బకాయిల కోసం ఈనెల 22వ తేదీనచిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు చలో కలెక్టర్ రేటు కార్యక్రమం నిర్వహించ దలిచామని రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కలెక్టరేట్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో రాబోయే సంవత్సరం మన మామిడిని ఎలా అమ్ముకోవాలి. ప్రభుత్వ నుంచి మనకు ఏ ఏ సదుపాయాలు అవసరమో సమగ్రంగా చర్చించుకొని అధికారులతో చర్చించడం జరుగుతుందని తెలిపారు.మన ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు సమావేశానికి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కే సురేంద్రన్, సంజీవరెడ్డి,మునిరత్నంనాయుడు,ఉమాపతి నాయుడు, మోహన్ రెడ్డి,సందీప్ మరియు నాయకులు పాల్గొన్నారు.







