ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు మృత్తిక దినోత్సవను పురస్కరించుకొని ఎన్‌ఎస్‌ఎస్, వృక్షశాస్త్ర మరియు రసాయన శాస్త్ర విభాగం మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్‌జి‌ఓ ఏలేశ్వరం మండల విభాగం ఆద్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె. వేంకటేశ్వర రావు అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతు ప్రకృతిలో ఉన్న సహజ విధానాలను ఉపయోగించి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలను సాగు చేసే విధానం ద్వారా పంటలు పండించడం చాలా అవసరమని, మట్టి ఆరోగ్యం, కాపాడడం మనందరి భాద్యత అని, నేలతల్లి ద్వారా మాత్రమే జీవరాశికి ఆరోగ్యం సంబవిస్తుందని ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా సాద్యమాని తెలియజేశారు. డా. ప్రయాగ మూర్తి ప్రగడ మాట్లాడుతూ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రాకృతిక వ్యవసాయం పెరుగుతోందని . ఆంధ్రప్రదేశ్‌లో దీనిని ఎపిసిఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ సహజ వ్యవసాయం) పేరుతో పెద్ద స్థాయిలో అమలు చేస్తున్నారని, రసాయనిక ఎరువులు వాడకుండా రసాయన ఖర్చులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని , మట్టి ఆరోగ్యం మెరుగవుతుందని , పంటల నాణ్యత పెరుగుతుందని , నీటి వినియోగం తగ్గుతుందని , రైతులకు లాభదాయకం, పర్యావరణానికి స్నేహపూర్వకమైన వ్యవస్థ ఆరోగ్యకరమైన ఆహారం జీవ వైవిద్యం లో కొన్ని జీవులు అంతరించకుండా కాపాడగలుగుతామని ప్రతి ఒక్కరినీ ప్రకృతి వ్యవసాయంపై చైతన్య పరచాలని విద్యార్డులకు కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ ఎన్‌జి‌ఓ ఏలేశ్వరం మండల కోఆర్డినేటర్ మజ్జి నాగేశ్వర రావు మాట్లాడుతూ జీవామృత,ఘన జీవామృతం, నీమ్ పచ్చడి తయారీ ప్రాకృతిక వ్యవసాయ ప్రయోజనాలు మొదలైన అంశాలు తెలియజేశారు. కార్యక్రమంలో అద్యపకులు వి రామ రావు కె. సురేష్. ఎస్‌కే మదీనా, డా. శివప్రసాద్. వీరభద్ర రావు, శ్రీ లక్ష్మి,డా. కె బంగార్రాజు,మేరి రొసిలిన, పుష్పా , సతీశ్, మరియు అద్యపకేత సిబ్బంది , పెద్ద సంఖ్యలో విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం