పెద్దనాపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మెగాపేరెంట్స్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ 3.0 కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,జనసేన నాయకులు మేడిశెట్టి బాబి,మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి,నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే సత్యప్రభను స్కౌట్, మార్చ్ తో ఘన స్వాగతం పలికారు.పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీట్ లోఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకులతోకలిసి పాల్గొన్నారు. ముందుగా పాఠశాల విద్యార్థులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటతోకార్యక్రమం ప్రారంభిచారు.విద్యార్థినులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రస్తుత సమాజంలో ఎదురయ్యే పలు విషయాలు పట్ల అవగాహన ప్రదర్శన చేపట్టారు.గొల్లపల్లి బుజ్జి పాఠశాల విద్యార్థులకుసమకూర్చిన క్రీడా దుస్తులను ఎమ్మెల్యే సత్యప్రభ విద్యార్థులకు అందజేశారు.ఐ సి డి ఎస్ సి డి పి ఓ పద్మావతి ఆధ్వర్యంలో చేపట్టిన చైల్డ్ మ్యారేజ్ పై అవగాహన కల్పిస్తూ ప్రమాణము చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ప్రభుత పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు.విద్యార్థులు తమ చదువుపై శ్రద్ధ వహిస్తూఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం లో పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సత్యప్రభ,కూటమి శ్రేణులు సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్ వర్మ, తాసిల్దార్ కుసరాజు,డిప్యూటీ ఎంపీడీవో రామరాజు వర్మ,సిడిపిఓ పద్మావతి,సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశరావు ఎంపీటీసీ బుద్ధ సత్యవతి ఈశ్వరరావు,సొసైటీ అధ్యక్షులు సూతి భూరయ్య, పెంటకోట మోహన్,కొప్పుల బాబ్జి, శెట్టి చిన్న,సంకర సత్యనారాయణ, పలువురు కూటమ పార్టీ శ్రేణులు విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు హాజరయ్యారు.

  • Related Posts

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*