

మన న్యూస్ పాచిపెంట డిసెంబర్8 పార్వతీపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కాఫీ గింజలను తయారు చేయడానికి ప్రోసిజర్ మిషన్ ప్రభుత్వం అందించాలి.గిరిజన కార్పొరేషన్ ద్వారా కాపీ గింజలు కొనుగోలు చేయాలి.కాఫీ తోటలను పండించే గిరిజన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి. సిపిఎం పాచిపెంట మండలం సతాబి వద్ద కాపీ తోట రైతులు గిరిజన రైతులు అల్ప జన్నీ అప్పలస్వామి ఆదినారాయణ గౌరమ్మ మాట్లాడుతూ. ఎంతో కష్టపడి కాఫీ తోటను పెంచుతున్నాము మిషన్ లేకపోవడం వలన కాఫీ పళ్ళను ఏరి. రోకలితో దంచడం తర్వాత కడిగి ఎండబెట్టి ఎన్నో కష్టాలు పడితే తప్ప గింజలు తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల కిందట దమయంతి పిఓ ప్రోత్సాహంతో కాపీ తోటలను వేసాము అప్పుడే పిక్కలు మిషన్ ద్వారా తీయడానికి ప్రొసీజర్ మిషన్ అందిస్తామని నేటికీ అందించలేదని ఇంటిళ్లపాది కష్టపడి పనిచేసిన ప్రైవేటు వ్యాపారులు గత సంవత్సరం కిలో 60 రూపాయలు కొనుగోలు చేశారని ఇప్పుడు 160 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని అది కూడా మేము కాఫీ గింజలను తయారుచేసి మోసుకొని ఎంతో కష్టపడి సంతలకు తీసుకు వెళితే తక్కువ రేటుకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాఫీ తోటలను గింజలను పరిశీలన చేసిన సిపిఎం జిల్లా నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజన కార్పొరేషన్ ద్వారా ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి పెట్టి పురుసీజర్ మిషన్ ఏర్పాటు చేసి గిరిజనులకు అందించాలని జిసిసి ద్వారా కాఫీ గింజలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అటవీ ఉత్పత్తులతో పాటు ఈ పంటకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే సతాబి తంగలం పంచాయతీలలో పండించినటువంటి కాపీ తోటలను గిరిజనులకు అభివృద్ధి కోసం కృషి చేస్తే మరింత మంది రైతులు బాగుపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి పెట్టి కాపీ తోటలు పెంపకం పై గిరిజనులకు అవగాహన కలిగించి వారిని అన్ని విధాల ఆదుకోవాలని గిట్టుబాటు ధర విశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పాడేరులో కూడా బాగా కాపీ తోటలో గింజలను అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఇక్కడ కూడా అటువంటి దృష్టి పెట్టాలని గిరిజన కార్పొరేషన్ ఉంది. కొనుగోలు చేసే విధంగా ఐటిడి ఏపీఓ ముందుకు రావాలని ఆదుకోవాలని అన్నారు.