ఎస్‌టియు జిల్లా కౌన్సిల్ సమావేశం – విజయవంతం చేయండి

చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గ ఎన్నికలు చేపట్టబడనున్నాయి. ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు బాలగంగి రెడ్డి, ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎస్టియు అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒకే ఒక డి.ఏ మంజూరు చేసిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పన్నెండో వేతన సంఘం చైర్మన్ నియామకం, ముప్పై శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిల విడుదల, ఉమ్మడి సేవా నియమావళి అమలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు, పి.ఎఫ్‌ మరియు ఏ.పీ.జి.ఎల్‌.ఐ రుణాల మంజూరు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సంక్రాంతి పండుగకు ముందుగా సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితిలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శులు హేమచంద్రారెడ్డి, ము. మునెప్ప, పురుషోత్తం, దేవరాజు రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. అందువల్ల మండల, జిల్లా ఎస్టియు నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికా ప్రకటనలో కోరడమైనది.

Related Posts

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

చిత్తూరు, మన ధ్యాస డిసెంబరు-7‎ఈరోజు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థల్లో జరిగిన ఎస్‌టియు 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా శాఖ అధ్యక్షులుగా రెండవ సారి ఎన్‌.ఆర్‌.…

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

బంగారుపాళ్యం డిసెంబర్ 7 మన ధ్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

*ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

బంగారుపాళ్యం మెయిన్ రోడ్లోగల మురుగు నీటి కాలువకు మోక్షం ఎప్పుడో ?

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*