

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 108 అంబులెన్సును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి జెండా ఊపి ప్రారంభించారు..అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రకరకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ఎక్కడైనా ప్రమాదం వాటిలితే 108కు సమాచారం నిమిత్తం ప్రమాదం జరిగిన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్యులు ప్రజలు తదితరులున్నారు.