వింజమూరు, మన ధ్యాస, అక్టోబర్ 05,(కె ఎన్ రాజు).

ఎపి యన్ జి జి ఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికల నామినషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం 10.30 గంటల నుండి వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగినవి.ఈ సందర్భంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు పరచగా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారి కావలి తాలూకా అధ్యక్షులు శివ సత్యనారాయణ , సహాయ ఎన్నికల అధికారిగా డీ,వీ నాగరాజు మరియు ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా శ్రీధర్ ప్రకటించారు.ఈ ఎన్నికలలో వింజమూరు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు వెలుగోటి మధు సహద్యక్షులు ఎమ్.కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు3 పోస్టులు కె.పద్మ కె శ్రీనివాసులు రెడ్డి ఎంపీడీఓ వింజమూరు వెంకటేశ్వర్లు,కార్యదర్శి కె.రామారావు,సంయుక్త కార్యదర్సులు3 పోస్టులు బి,రామిరెడ్డి ఎ.వివేకా,బి,విజయమ్మ,సంయుక్త కార్యదర్శి మహిళ డి.తనూజ,కోశాధికారి పి.నరసయ్యవారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు మరియు అభినందనలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన వింజమూరు తాలూకా యూనిట్ కార్యవర్గవర్గ సభ్యులను, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు పల్లి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంచార్జి అధ్యక్షులు నంది మండలం ఆంజనేయ వర్మ ,జిల్లా కార్యదర్శి గాది రాజు రామకృష్ణ ఎన్నికైన కార్య వర్గ సభ్యులకు శుభాకాంక్షలు మరియు అభినందించారు. ఏపీ ఎన్ జిఓ, వింజమూరు తాలూకా (కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలు) నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెలుగోటి మధు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాపాడటానికి 24/7 కృషి చేస్తానని న్యూస్ టుడే కి చెప్పడం జరిగింది.మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.స్వర్ణలత, జిల్లా జేఏసీ చైర్మన్ యు.చిన్నమ్మ, వైస్ ప్రెసిడెంట్ ఇ.కరుణమ్మ, జిల్లా కన్వీనర్ నవోదయ మహిళ విభాగం నూతన కార్యవర్గం మహిళా విభాగాన్ని ఎన్నుకోవడం జరిగింది.వారందరికీఅభినందనలుతెలిపారు.నూతనంగా ఎన్నిక అయిన వింజమూరు తాలూకా యూనిట్ అధ్యక్ష,కార్యదర్శి లును ఎంప్లాయిస్ అందరు ఘనముగా పూల మాల శాలువాతో సత్కరించారు










