అమాయకులు అయిన గిరిజన మహిళ నెల్లూరు నగర్ మేయర్ స్రవంతిని అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగిస్తే, పాపం ఊరికే పోదు…. సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 4 :నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ స్రవంతిని ఈనెల 18వ తేదీ అవిశ్వాసం తీర్మానం పెట్టి తొలగించబోతున్న విషయం దుర్మార్గం అవినీతి నీచమైన చర్య అని సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు అన్నారు.గురువారం నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించినారు .ఈ సందర్భంగా సామాజిక తత్వవేత్త యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ….. రాజ్యాంగ పరంగా ఎన్నికైన వ్యక్తిని పదవి కాలం పూర్తి కాకుండానే దించి వేయడం మంచి పద్ధతి కాదు అని అన్నారు.ఒక విషయం ఆలోచించండి రాష్ట్రంలో గిరిజన మహిళను రాజ్యాంగ పదవి నుండి తొలగించిన దాఖలు ఎక్కడైనా ఉన్నదా అని ప్రశ్నించారు . స్వర్గీయ ఎన్టీఆర్ పదవి నుండి దించి వేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అనే తెలిపారు. ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన 40 మంది కార్పొరేటర్ లను మీ పార్టీలోకి తీసుకోవడం ఎంతవరకు న్యాయం, ధర్మం అని అడిగారు. ఈ విధంగా చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీ పార్టీకి పడుతుంది అని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, అమాయకులు, అనామకుల్ని అయినా గిరిజనులను వేధిస్తే పాపం ఊరికే పోదు అని అన్నారు . రాష్ట్రంలో శివ భక్తులు ఎక్కువ. ఇలాంటి నీచమైన, నికృష్టమైన పాపాలకు పోతే గత ప్రభుత్వాన్ని పెట్టిన రెండు నిలువ నామాలు బదులు, మీకు మూడు అడ్డ నామాలు పెడతారు అని అన్నారు.ఇంకో విషయం నెల్లూరు జిల్లా లో గంజాయి వాడకం అధికమైనది. విద్యార్థులు యువత గంజాయికి బానిసైనారు. వారిని రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు.పెంచలయ్య హత్యకు కారణం గంజాయి అన్న విషయం తెలిసిందే అని అన్నారు. పెంచలయ్య గంజాయి పై పోరాడుతుంటే పోలీసులు, ప్రభుత్వం చూస్తూ ఉంది. అప్పుడే గంజాయి పై చర్యలు తీసుకుంటే పెంచలయ్య జరిగేది కాదు అని అన్నారు. ప్రభుత్వానికి చెబుతున్న ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రభుత్వానికి ముప్పు రాకుండా ఉండాలంటే అమాయకులైన గిరిజనులు జోలికి పోకుండా ఉండాలి అని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తే ఉన్నారు. మీ డ్రామాలు ఇంకా జరగవు. గత ప్రభుత్వాన్ని పట్టిన గతే మీకు పట్టకూడదు అని అన్నారు.చివరగా ప్రభుత్వానికి చెబుతున్న ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు అధికారం ఇస్తే ,ఈ విధమైన అరాచక, అన్యాయమైన పరిపాలించడం ఎంతవరకు న్యాయం, ధర్మం అని ప్రశ్నించారు.

  • Related Posts

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    మన ద్యాస ప్రతినిధి, సాలూరు : – మండలంలోని మామిడి పల్లి శ్రీ సరస్వతీ శిశు మందిర్లో కమిటీ సభ్యులు, ఆచార్యులు నిర్వహించిన సప్త శక్తి సంగం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వక్తల సందేశాన్ని…

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    మన ధ్యాస ప్రతినిధి , సాలూరు డిసెంబర్ 7:- స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం. స్నేహం కంటే గొప్పబంధం మరేది లేదని 1987 సంవత్సరం పాచిపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవతరగతి బ్యాచ్ రుజువు చేసింది. ప్రతీ సంవత్సరం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం