ఉదయగిరి,మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 4( కె నాగరాజు);
ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీలోని గుడినరవ గ్రామంలో వి పి ఆర్ నేత్ర శిబిరం బుధవారం గుడినరవ టిడిపి యువ నాయకులు బాలిబోయిన రాజా, ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వి పి ఆర్ నేత్ర వైద్య పరీక్షలకు 200 నుండి,300 మంది వరకు ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలానే అద్దాలు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ… నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రజల సమస్య తమ సమస్యగా మలుచుకుని.. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఉచితంగా నిర్వహిస్తూ.. ముందుకు సాగుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నీ గుర్తుపెట్టుకుని మేట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి, విపిఆర్ నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తూ… అనేక పేద ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన కొనియాడారు. విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం జర్మనీ టెక్నాలజీతో కూడిన పరికరాలు.. తీసుకొచ్చి పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తెలిపారు. అలానే ఉదయగిరి నియోజవర్గ శాసనసభ్యులైనటువంటి కాకర్ల సురేష్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో, టిడిపి యువ నాయకులు, బాలి బోయిన రాజా యాదవ్, బోడ్డు ప్రసాద్ యాదవ్, బాలిబోయిన చిన్నయ్య యాదవ్,చింతన బోయిన బాలకృష్ణ యాదవ్ ,అంబటి బ్రాహ్మ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.









