వింజమూరు, మన ధ్యాస, అక్టోబర్ 03(నాగరాజు కె).
ఏపి ఎన్జీజీవోస్ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ నామినేషన్ ప్రక్రియ స్థానిక వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 5 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని వింజమూరు తాలూకా ఎన్నికల అధికారి మరియు కావాలి తాలూకా అధ్యక్షులు శివ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.ఇందుకు సంభందించి నవంబర్ 19 వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం తాలూకా యూనిట్ ఎన్నికలు జరుగుతాయి మరియు ఇందుకు గాను సహాయ ఎన్నికల అధికారిగా కావలి తాలూకా కార్యదర్శి డి. వి.నాగ రాజు ని అలాగే ఎన్నికల పర్యవేక్షణకు జిల్లా ఉపాధ్యక్షలు పి సతీష్ బాబులను జిల్లా అధ్యక్షలు నియమించారాని తెలియ జేశారు కావున వింజమూరు తాలూకా పరిధిలోని ఉద్యోగులందరూ ఈ ఎన్నికలో పాల్గొని ఎన్నికలు విజయవంతం చేయాలని కోరారు









