కలిగిరి డిసెంబర్ 1 మన ధ్యాస న్యూస్ (నాగరాజు కె)

కలిగిరి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ ప్రవేశం (కళాపకర్షణ) కార్యక్రమం భక్తి భరిత వాతావరణంలో ఎంతో వైభవంగా నిర్వహించబడింది.దేవాలయం ప్రాంగణమంతా వేదమంత్రోచ్ఛారణలు,నాదస్వర ధ్వనులు, మంగళభేరి నినాదాలతో కళకళలాడింది. స్థానిక భక్తులు,గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రజలకు అండగా నిలుస్తూ, సేవాభావంతో ముందుకు సాగే మన ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కలిగిరి గ్రామానికి విచ్చేసి స్వామివారి బాలాలయ ప్రవేశాన్ని ప్రత్యక్షంగా దర్శించి,ప్రత్యేక పూజలకు హాజరై, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఎమ్మెల్యే కాకర్ల రాకతో కార్యక్రమానికి మరింత శోభ పెరిగింది.స్థానిక ప్రజలు ప్రేమాభిమానాలతో స్వాగతం పలికారు గ్రామాభివృద్ధి, దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఆయన అభిప్రాయాలు తెలియజేసి, భక్తుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామ నాయకులు,మండల ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు,మహిళామండలి,యువసేవా సంఘాలు మరియు ప్రాంతీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందే భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు










