

మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 8
సాధారణంగా పూర్వ విద్యార్థుల కలయిక పదవ తరగతిలో విద్యార్థులు కలుస్తూ పరిచయం చేసుకుంటూ తన స్కూల్లో జరిగినటువంటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి నందు 2001_04 సంవత్సరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు8/12/24 ఆదివారం నాడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఎస్సీ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని, 20 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో నలుమూలల నుండి వచ్చిన తన స్నేహితులు చూడడం మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కలయిక ఇలాగే కొనసాగించి అప్పుడప్పుడు కలుసుకోవాలని అందరూ అభిప్రాయపడ్డారు. అనంతరం పూర్వ విద్యార్థులు కళాశాలను, హాస్టల్ సందర్శించి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.