కలిగిరి నవంబర్ 29, మన ధ్యాస ప్రతినిది (నాగరాజు)

కలిగిరి మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలును గమనించేందుకు భాగంగా, ప్రతి రైతు కుటుంబంతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు,అవసరాలుగురించి,తెలుసుకున్నారు.ప్రత్యేకంగా,అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా 7 వేల రూపాయల ఆర్థిక సహాయం రైతుల ఖాతాలలో జమయ్యిందా లేదా అన్న విషయంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి రైతులను ప్రశ్నిస్తూ వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అందరూ రైతన్నలు ఏకగ్రీవంగా స్పందిస్తూ తమకు అన్నదాత సుఖీభవ మొత్తం సమయానికి అందిందని,అందిన నిధులు వ్యవసాయ పనుల్లో కొంతమేర ఆర్థిక భరోసాగా నిలిచాయని తెలిపారు.పంట సాగు కోసం అవసరమైన విత్తనాలు,ఎరువులు,ఇతర వ్యవసాయ ఖర్చులకు ఈ సాయం ఎంతో ఉపయోగపడినదని వారు హర్షం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను శ్రద్ధగా విని, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకునేందుకు అధికారులకు సూచిస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు.రైతుకు అండగా నిలబడటం తనకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతేనని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు, అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు










