
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తానని డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు. డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన మొదటిసారిగా నిజాంసాగర్ కు వస్తున్న ఏలే మల్లికార్జున్ కు,ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కార్యకర్తలు స్వాగతం పలికారు.అనంతరం సాయి ఫంక్షన్ హాల్ సమావేశంలో ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో ఏ కార్యకర్తకు వెన్నెంటుంది పనిచేస్తానని అన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి గ్రామంలో సర్పంచ్లను గెలిపించుకునే విధంగా కార్యకర్తలందరూ కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,నాయకులు అడివికేట్ రామ్ రెడ్డి,సాయి పటేల్, ఎన్.ఆర్.ఐ భాస్కర్ రెడ్డి, గుర్రపు శ్రీనివాస్, మండలాల చైర్మన్లు మాజీ చైర్మన్లు కార్యకర్తలు తదితరులున్నారు,







