మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు నాయకుల ఘన నివాళులు

చిత్తూరు, మన ద్యాస నవంబర్-28: చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి 135వ వర్ధంతి సందర్భంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖ తరఫున పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంలో ఎస్‌టియు రాష్ట్ర సహాధ్యక్షులు గంట మోహన్ మాట్లాడుతూ, “బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విద్య అందించేందుకు తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు జ్యోతిరావు పూలే. ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి అపూర్వం. కులవ్యవస్థ నిర్మూలనకు, సామాజిక అసమానతల తొలగింపుకు ఆయన పోరాటం చేసిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన ఆలోచనలు ఈ తరానికి, భవిష్యత్ తరాలకు శాశ్వత మార్గదర్శకం” అని అన్నారు. అదే విధంగా ఎస్‌టియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “అణగారిన వర్గాల అభ్యున్నతికై పూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి. పూలే ఆశయాలే యువతకు లక్ష్యంగా ఉండాలి. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని ఆయన గాఢంగా నమ్మారు. ఆయన స్ఫూర్తితో ప్రతి యువకుడు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు రాష్ట్ర కమిటీ కన్వీనర్లు పురుషోత్తం, దేవరాజులు రెడ్డి, చిత్తూరు విభాగ సమన్వయకర్త ఢిల్లీ ప్రకాశ్, అలాగే గుణశేఖరన్, సుబ్రహ్మణ్యం పిళ్ళై, రంగనాథం, పెద్దబ్బరెడ్డి, ప్రహసిత్, వెంకటేశ్వర రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

ప్రజాసేవలో ఇద్దరూ….ఇద్దరే , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి…. పొంగూరు నారాయణ

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు