

వింజమూరు నవంబర్ 27 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి :///
కర్నూలు అగ్ని ప్రమాద బస్సు దుర్ఘటనలో దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోయిన గోళ్ళ రమేష్,గోళ్ళ అనూష మరియు వారి ఇద్దరు చిన్నారి పిల్లల చిత్రపటములకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పుష్పాంజలి ఘటించి,వారికి హృదయపూర్వక నివాళులర్పించారు.ఈ బాధాకర సందర్భంలో ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అమాయక ప్రాణాలను కోల్పోయిన ఈ విషాదం ఎంతో కలచివేసిందని అన్నారు.వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా పరామర్శించిన ఎమ్మెల్యే,ఈ అకస్మాత్తు జరిగిన విషాదాన్ని తట్టుకుని నిలబడేందుకు ధైర్యం,ఓర్పు నింపాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యుల హృదయాలకు మనశ్శాంతి, ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు.అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయం మరియు మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు








