గొట్టిపాటి ప్రసాద్ నాయుడు హత్యపై ఎమ్మెల్యే సురేష్ ఆగ్రహం – నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక
టిడిపి నాయకుడి దారుణ హత్య – బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ.
హత్య ఘటన స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సురేష్

జలదంకి నవంబర్ 27 మన ధ్యాస న్యూస్ ప్రతినిధి:///
గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో నిన్న అతి దారుణంగా హత్యకు గురైన టిడిపి నాయకుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించగా,ఈ ఘటన తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ అనూహ్య పరిస్థితిలో వారికి ధైర్యం చెబుతూ, న్యాయం కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ దారుణ హత్యకు బాధ్యులైన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ అధికారుల సమక్షంలో,హత్య జరిగిన స్థలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు.స్థానిక ప్రజలను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.ఈ కేసులో నిజానిజాలు వెలికితీయడానికి, నేరగాళ్లను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.ఈ సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే,బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం అందేవరకు తమ సహాయం, సహకారం నిరంతరంగా ఉంటుందని హామీ ఇచ్చారు








