కొండాపురం, నవంబర్ 26 మన ధ్యాస న్యూస్ :///
*రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నేకునాంపేట,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు వి.వెంకటరమణ ప్రసంగిస్తూ దేశ వ్యాప్తంగా ప్రతి యేటా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అని 2015 కు ముందు నవంబర్ 26న న్యాయ శాస్త్ర దినోత్సవంగా, జరుపుకునేవారని, 2015తరువాత దీనిని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని వారు పేర్కొన్నారు.రాజ్యాంగ రచనా సంఘానికి డా.బి.ఆర్. అంబేద్కర్ చైర్మన్ గా వ్యవహారించారని,భారత రాజ్యాంగ రూపకల్పన లో డా!!బి. ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, డ్రాయింగ్ మొ.పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు కాంతారావు,సరిత,లావణ్య,శివరామమూర్తి, కృష్ణసాయి,హరిప్రసాద్,హరినారాయణ పాల్గొన్నారు*








